గురువారం సాయంత్రం మక్తల్ మండలం గుర్లపల్లి గ్రామ శివారులో గూడ్స్ బండి చక్రాల కింద నలిగి 18 గొర్రెలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గుర్లపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కుర్వ వెంకటప్ప తన గొర్రెలను పట్టాల పక్కన ఉన్న పొలంలో మేపుతుండగా, రైలు బండి రావడం గమనించి గొర్రెలను పక్కకు తప్పించే ప్రయత్నంలో అవి హఠాత్తుగా పట్టాలపైకి వెళ్లాయి. రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గూడ్స్ బండి కింద పడి గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటనలో రైతుకు సుమారు రూ. రెండు లక్షల నష్టం వాటిల్లిందని వాపోయాడు.