బీసీ కులాలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా వెనకబడిన బీసీ కులాల జీవితాల్లో మెరుగైన అవకాశాలు కల్పించి, వారి అభివృద్ధికి నోచుకుంటుందని మక్తల్ ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్ ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్కరికీ బీసీ కులాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే చేపట్టి, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.