భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ మహనీయుడని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మదనాపురం మండలంలోని గోపాల్ పేట్ గ్రామంలో డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని దళిత సంఘాల నాయకులతో కలిసి మంత్రి శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగి ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు అని కొనియాడారు.