మక్తల్: కొబ్బరి చెట్టుపై పిడుగు.. తప్పిన ప్రమాదం!

శనివారం సాయంత్రం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో పిడుగుపాటు కలకలం రేపింది. గ్రామానికి చెందిన పిరికి ఆశప్ప ఇంటి ముందున్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో, చెట్టుతో పాటు ఇల్లు, ఇంట్లోని నీటి పైపులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు, పిడుగు తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బాధిత కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్