మక్తల్: ప్రభుత్వ పాఠశాలలో కొత్త గదులను ప్రారంభించిన మంత్రి

మక్తల్ నియోజకవర్గం అమరచింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు గదుల నిర్మాణానికి ఆదివారం మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవి కుమార్, ఎంఈఓ భాస్కర్ సింగ్, టీపీసీసీ ప్రతినిధి కేశం నాగరాజు గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్