మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండలం అవుసలొనిపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణానికి మంత్రి డా. వాకిటి శ్రీహరి శనివారం భూమి పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయిస్తానని అన్నారు. అదే విధంగా క్రీడాకారుల కోరిక మేరకు క్రీడా మైదానం కొరకు స్థల పరిశీలన చేసి 2 లేదా 3 ఎకరాలలో క్రీడా మైదానాన్ని నిర్మిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.