మక్తల్: వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి శ్రీహరి

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆదివారం బయో ఎటర్నవిట్ హాకింగ్ వెల్నెస్ సెంటర్‌ను మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా, మంత్రి సెంటర్‌లోని వివిధ థెరపీ యంత్రాలను పరిశీలించి, వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం నేపథ్యంలో ఇలాంటి వెల్నెస్ సెంటర్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్