హైదరాబాద్ లోని రవీంద్ర భారతీలో ఆదివారం రాత్రి జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక పోటీల్లో మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి దుర్యోధనుడి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గంభీరమైన గెటప్ తో పాటు మంత్రి శ్రీహరి చెప్పిన డైలాగులు, హావభావాలు కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చాయి.