మక్తల్ పట్టణంలో త్వరలోనే నూతన బస్టాండ్ నిర్మిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. మంగళవారం ఆర్టీసీ సమావేశంలో మాట్లాడుతూ, అధికారులు భూమిని పరిశీలించి నివేదిక ఇస్తే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మున్సిపల్ ఛైర్మన్ మానస హనుమంతు, అధికారులు పాల్గొన్నారు.