మక్తల్: గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది: మంత్రి శ్రీహరి

రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని అన్నారు. బుధవారం నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గోలపల్లి నుండి మంథన్ గోడ్ రోడ్డుకు రూ. 1.5 కోట్లతో నిర్మించ తలపెట్టిన నూతన వంతెన నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. గతంలో మక్తల్ ను ఎవరూ పట్టించుకోలేదని, రోడ్లు పెద్దగా ఉంటేనే గ్రామాలకు గౌరవం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్