గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించారు. అక్కడ వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి, వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో మక్తల్ ను ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతానని, వస్త్ర ఎగుమతులకు కేంద్రంగా మారుస్తానని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కుట్టు, కంప్యూటర్, అల్లికలు, మెహందీ శిక్షణ పొందుతున్న వారికి ఆయన పలు సూచనలు చేశారు.