కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన ఉచిత బస్సు పథకం మహిళల గౌరవాన్ని నిలబెట్టిందని, మహాలక్ష్మి పథకం మహిళల ఆర్థికాభివృద్ధికి, కుటుంబ మెరుగుదలకు తోడ్పడుతోందని మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ లో ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.