మక్తల్ నియోజకవర్గం అమరచింత మండలంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొంటారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేజీ మహేందర్ రెడ్డి తెలిపారు. అమరచింతలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో అదనపు గదులు ప్రారంభిస్తారని, అనంతరం మంత్రి సింగంపేటలో అంగన్వాడీ భవనాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మంత్రి కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.