నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆదివారం 15 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు లవ్ జిహాద్ కారణమని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న (సోమవారం) నారాయణపేట పట్టణ బంద్ కు వి. హెచ్. పి, బజరంగ్ దళ్ నాయకులు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.