నారాయణపేట జిల్లా కేంద్రం నుండి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరవేసే అప్పకుపల్లి, కోటకొండ, కోయిలకొండ రోడ్డు పనులు పూర్తి చేయాలని ML పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ML పార్టీ జిల్లా నాయకులు కె కాశీనాథ్, హాజీ మలగ్, నారాయణ, నీలి దామోదర్ జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు. రోడ్డు పనులను పటిష్టంగా చేపట్టాలని వారు కోరారు. కలెక్టర్ స్పందించి రోడ్డు భవనాల శాఖ అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం.