సకలజనుల సమ్మెస్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమం: శ్రీహరి

శుక్రవారం ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదం తెలిపి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ధర్మ దీక్ష చేపట్టారు. మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని, సైనికుడు, రైతు, ఉద్యమకారుల ప్రాముఖ్యతను వివరించారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో బీసీ రిజర్వేషన్లకు బీజం పడిందని, సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిల్లును తీసుకొచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అన్ని పార్టీలను ఒప్పించి బీసీ బిల్లు ప్రవేశ పెట్టామని, ప్రభుత్వానికి సలహా ఇవ్వకుండా నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్