ముక్తల్: బ్యాంకు క్యూలో నిల్చొని కుప్పకూలిన రైతు

మక్తల్ మండలం కర్ని గ్రామానికి చెందిన గిన్నె రాములు (40) అనే రైతు, గురువారం మక్తల్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన ఖాతాలో జమ అయిన నగదును డ్రా చేసుకోవడానికి క్యూలో నిలబడ్డాడు. క్యూలో నిలబడి ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒకేసారి రైతులకు నగదు డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని తోటి రైతులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్