జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని బాలబ్రహ్మేశ్వర, జోగులాంబ అమ్మవారి ఆలయంలో మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని, ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకము లేకుండా అమ్మవారు చూడాలని ఆకాంక్షించారు.