నారాయణపేట: నిందితుడిని అరెస్టుచేసేవరకు అంత్యక్రియలునిర్వహించం

నారాయణపేట జిల్లా కోస్గిలో నవ వధువు శ్రీలత ఆత్మహత్యకు న్యాయం చేయాలంటూ బాధితులు గురువారం రాత్రి చేపట్టిన ధర్నాలో డీఎస్పీ లింగయ్య నచ్చజెప్పే ప్రయత్నం విఫలమైంది. యువతి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసే వరకు విరమించేది లేదని, ఎస్పీ వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నంలోగా నిందితుడిని అరెస్టు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నాలుగు గంటల పాటు జరిగిన ఆందోళనతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నిందితుడిని అరెస్టు చేసేవరకు అంత్యక్రియలు నిర్వహించబోమని మృతురాలి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్