నారాయణపేట: వైభవంగా ఆంజనేయ స్వామి రథోత్సవం

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని జిన్నారంలో శుక్రవారం ఆంజనేయ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత, జై శ్రీరామ్ నినాదాలతో భక్తులు రథాన్ని లాగారు. ఆంజనేయ స్వామి తమను చల్లగా చూడాలని భక్తులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్