నారాయణపేట: బ్యాంకులు ఎటీఎంల వద్ద ఆకస్మిక తనిఖీలు

నారాయణపేట జిల్లా కేంద్రంలోని బ్యాంకుల వద్ద బుధవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అనుమానాస్పదంగా కనిపించిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ శివశంకర్ మాట్లాడుతూ, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలలో లావాదేవీలు చేసే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నగదు లావాదేవీల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగదు తీసుకెళ్లేవారు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్