నారాయణపేట: బొలెరో-బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

నారాయణపేట జిల్లా మరికల్ మండలం కన్మనూరు చౌరస్తా వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జిన్నారం నుంచి వస్తున్న బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న కరుణాకర్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108లో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్