నారాయణపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ కొండా శ్వేత సత్య యాదవ్ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేస్తూ మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కొండా శ్వేత సత్య యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆమె చెప్పారు. పలువురు బీజేపీ నేతలు ఛైర్ పర్సన్ కొండా శ్వేత సత్య యాదవ్కు శుభాకాంక్షలు తెలిపారు.