మక్తల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం సినీ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి నారాయణపేట జిల్లా మరికల్ శివారులోని ఒక రెస్టారెంట్ వద్ద ఆగారు. వారిని చూసిన స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆశ్చర్యానికి గురై, వారితో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. సినీ దిగ్గజాలను నేరుగా కలవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.