నారాయణపేట జిల్లా మరికల్ మండలం బుడ్డగాని తండా, ఉట్కూర్ మండలం తిమ్మారెడ్డిపల్లి తండాలో ఆదివారం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసినట్లు సీఐ అనంతయ్య తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందిన మేరకు దాడులు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 11 లీటర్ల సారా, పటిక స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నాటు సారా తయారు చేస్తున్న బుజ్జమ్మ, శాంతమ్మ, మంగమ్మ, అంతమ్మలపై కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు.