నారాయణపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం కారణంగా, రైతులు మార్కెట్ కు తెచ్చిన వరిధాన్యం తడిసిపోయింది. రైతులకు సరిపడా పాలిథిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో ఈ నష్టం జరిగింది. మార్కెట్ ఛైర్మన్ శివారెడ్డి తడిసిన ధాన్యం కుప్పలను పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.