నారాయణపేట: గడ్డివాము దగ్ధం

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఉల్లిగుండం గ్రామంలో చింతమొల్ల మాణిక్యప్ప అనే రైతుకు చెందిన గడ్డివాము రాత్రి అగ్నికి ఆహుతైంది. ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు నీటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్