నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో హోలీ పండుగ సందర్భంగా కొందరు యువకులు ఆకతాయి చేష్టలకు పాల్పడ్డారు. నారాయణపేట నుంచి గద్వాల్ వెళ్తున్న బస్సు ఊర లక్ష్మమ్మ దేవాలయం వద్దకు రాగానే, యువకులు డ్రైనేజీ నీటిని డబ్బాల్లో నింపి బస్సు ప్రవేశద్వారం వైపు విసిరారు. దీనితో డ్రైవర్ కార్తీక్ తో పాటు ప్రయాణికులపై మురుగునీరు పడి తీవ్ర అసౌకర్యం కలిగింది. ఈ సంఘటనతో బస్సు సుమారు గంటపాటు నిలిచిపోయింది. కండక్టర్ ఇమాన్యుల్ ఈ ఘటనపై తన ఆవేదన వ్యక్తం చేశారు.