నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో పెళ్లి వేడుక విషాదంగా మారింది. మల్లేశ్ (21) అనే యువకుడికి బుధవారం పెళ్లి జరగాల్సి ఉండగా, మంగళవారం తెల్లవారుజామున అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ధన్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.