నారాయణపేట: క్షుద్ర పూజ కలకలం

నారాయణ పేట జిల్లా కోస్గి మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. 10వ తరగతి గది ముందు ముగ్గు, నిమ్మకాయలు చూసిన అటెండర్ కృష్ణయ్య భయపడి ప్రధానోపాధ్యాయులు జనార్దన్ రెడ్డికి సమాచారం అందించారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భయాందోళనలో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు ధైర్యం చెప్పి తరగతులను కొనసాగించారు.

సంబంధిత పోస్ట్