నారాయణపేట: బీజేపీ కుట్రలో భాగంగా నామినేషన్ తిరస్కరణ: మంత్రి

శుక్రవారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, బీజేపీ చేసిన కుట్రలో భాగంగానే మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించిందని ఆరోపించారు. పెద్దల సభకు నటరాజన్ వస్తే సమస్యలపై ప్రశ్నిస్తుందని ఉద్దేశంతో బీజేపీ ఆమెపై కుట్రపన్ని రానీయకుండా చేసిందని మంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన జవాబు ఇస్తారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్