నారాయణపేట: రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

మారికల్ మండల కేంద్రంలోని కన్మనూర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బొంత కరుణాకర్ (21) అనే యువకుడు మృతి చెందాడు. బొలెరో వాహనం బైక్ ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన కరుణాకర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు. యువకుడి మరణంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్