నారాయణపేట: హెల్త్ కార్డుల పేరిట జీతాల కోతలు సరికాదు

డిజిటల్ హెల్త్ కార్డుల అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు, ఆసుపత్రులతో ఒప్పందాలు లేకుండానే ఉద్యోగుల జీతాల నుంచి 1.5 శాతం కోత విధించడం అన్యాయమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షుడు నరసింహ ఆదివారం అన్నారు. ఉద్యోగులకు పూర్తి వివరాలు వెల్లడించి, పారదర్శక విధి విధానాలతో హెల్త్ కార్డులు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్