నారాయణపేట: సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాం: కవిత

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునివ్వడాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు తీసుకోవాలని గురువారం నారాయణపేట జిల్లా దామరగిద్ద పర్యటన సందర్భంగా కవి వ్యాఖ్యలు చేశారు. అనర్హత పిటిషన్లు ఏళ్ల తరబడి నాన్చకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్