ఎన్‌ఎఫ్‌డీబీ తరలింపు లేదు: కేంద్రమంత్రి హామీ

రాజేంద్రనగర్‌లోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (NFDB)ను తరలించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం ఎన్‌ఎఫ్‌డీబీ కార్యాలయంలో కేంద్రమంత్రితో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వేలాది చెరువులు, రిజర్వాయర్ల అభివృద్ధి, ఆక్వా ఇన్సూరెన్స్ తదితర అంశాలపై కేంద్ర సాయం కోరామన్నారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి శ్రీహరి వెల్లడించారు. హైదరాబాద్‌లోనే ఎన్‌ఎఫ్‌డీబీ కొనసాగుతుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్