ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు విపక్షాల కుట్ర: శ్రీహరి

మక్తల్ ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు విపక్షాలు కుట్ర పన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం సాహసోపేత నిర్ణయంతో పండించిన పంటను కొనుగోలు చేస్తుందని, ఇప్పటికే 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, 8575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ధాన్యం తరలింపునకు 13 వేల లారీలను వినియోగించామని, విపక్షాల కుట్రలను అందరూ కలిసి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్