పాలమూరు: ప్రలోభాలకు లొంగకుండా సర్పంచ్ లను ఎన్నుకోండి- సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు వంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. నారాయణపేట జిల్లా మక్తల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి అడ్డుపడేవారిని కాదని, ప్రభుత్వానికి అండగా నిలిచి నిధులను తీసుకురాగల సర్పంచ్ అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్