సత్యసాయి సేవలను విస్తరించాలి: డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట జిల్లాలోని క్యాతన్ పల్లి వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో భీస్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి, నారాయణపేట సత్యసాయి సేవా సమితి కన్వీనర్ చిట్టెం మాధవ రెడ్డి మాట్లాడుతూ, సత్యసాయిబాబా సేవలను మరింత విస్తరించాలని సూచించారు. గతంలో సత్యసాయి నీటి పథకం ద్వారా నారాయణపేట జిల్లాకు తాగునీరు అందించిన ఘనత సత్యసాయి బాబాదేనని వారు గుర్తు చేశారు. సాయి భక్తులందరూ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్