నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల నుండి ఐఎంటిఎస్ఓ ప్రతిభా పరీక్షకు పాఠశాల విద్యార్థులు ఒలంపియాడ్ పరీక్షల ద్వారా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రతిభ సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. మక్తల్ పరిసర విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టడానికి పాఠశాల యాజమాన్యం అహర్నిశలు పనిచేయడానికి సిద్ధంగా ఉందని ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.