నారాయణపేట జిల్లా TRS యూత్ నాయకులు మనోజ్ గౌడ్, ఉద్యమ నాయకుడు శివశంకర్, జూలై 02న నిర్వహించనున్న ఉద్యమకారుల భూ పోరాటంలో ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని మంగళవారం పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, TRS పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ఉద్యమకారులకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు.