మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

మహమ్మదాబాద్ మండలం మంగంపేట్ గ్రామానికి చెందిన శ్రీశైలం (32) మరియు అంజయ్య (51) శుక్రవారం రాత్రి కోస్గి నుంచి మంగంపేట్ కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సంచర్లగేటు సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో గాయపడ్డారు. శ్రీశైలం ఎడమ చేతి వేళ్లు విరగడంతో పాటు పలు గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి, వారిని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్