వైకుంఠ ఏకాదశి సందర్భంగా, నూతన సంవత్సరం పురస్కరించుకుని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గురువారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సర తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను, కొత్త పరిచయాలను క్రోడీకరించుకుని, ప్రతి ఒక్కరూ నూతనోత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.