బలిజపల్లిలో మొబైల్ లోక్ అదాలత్ పై అవగాహన

వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం, బలిజపల్లి -జంగామాయిపల్లి జంట గ్రామాల ఉన్నత పాఠశాలలో మొబైల్ లోక్ అదాలత్ పై సోమవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఇన్చార్జి హెడ్మాస్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గంధం నాగరాజు, న్యాయవాదులు శ్రీదేవి, కృష్ణ, రవీందర్లు పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సేవలు, నిర్బంధ విద్య హక్కు, బాల కార్మిక నిరోధక, వరకట్న నిషేధ, బాల్య వివాహాల నిరోధక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్