బీసీలకు 42% రిజర్వేషన్ క్యాబినెట్ ఆమోదించినందుకు వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు శుక్రవారం ఘనంగా సంబరాలు చేశారు. ఈ సందర్భంగా డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బీసీల పట్ల తమకున్న నిబద్ధతను చాటుకుంటూ 42% రిజర్వేషన్ అమలుపరిచిన సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ కార్గేలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.