మహా గణనాథుడిని దర్శించుకున్న దేవన్న నాయుడు

వనపర్తి పట్టణంలోని రాయిగడ్డ వీధి (1వ వార్డు) లో స్థానిక యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రతిష్టించిన మహా గణనాథుడిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ​అనంతరం వారు మాట్లాడుతూ. "ఆ లంబోదరుని దివ్య కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆ విఘ్నేశ్వరుడిని మనసారా ప్రార్థించాను" అని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕