వంద ఏళ్ల కోదండరామస్వామి ఆలయానికి రూ.30 వేల ఆవు విరాళం

వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలంలోని శ్రీ శ్రీ శ్రీ కోదండరామ స్వామి ఆలయ నిర్మాణం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, నల్లబోతుల వెంకటేష్ అనే భక్తుడు బుధవారం రూ.30,000 విలువైన ఆవును ఆలయానికి విరాళంగా అందించారు. తన ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కుటుంబంతో కలిసి ఆలయ కమిటీ సభ్యులకు, పూజారులకు ఆవును అందజేశారు. ఆలయ పూజారి రంగాచార్యులు ఆవుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, విరాళాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్