వనపర్తి అభివృద్ధికి అందరూ సహకరించాలి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి జిల్లా నాగవరం బైపాస్ కొత్తకోట రోడ్డు నుంచి వైటీసీ బిల్డింగ్, మెడికల్ కాలేజ్ మీదుగా పాలకేంద్రం పెబ్బేర్ రోడ్డు వరకు నిర్మించే బైపాస్ రోడ్డును బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో స్థలాలు కోల్పోయే బాధితులకు ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు. వనపర్తి పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్లు విస్తరణను సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్