ఆత్మకూరు మండలంలో నూతనంగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రమేష్ నాయక్ తెలిపారు. జూన్ 15, 2026 నాటికి పాస్బుక్ పొందిన వారు మాత్రమే దీనికి అర్హులని, దరఖాస్తుకు జూలై 5 చివరి తేదీ అన్నారు. అర్హులైన రైతులు తమ పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను కార్యాలయంలో అందజేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.