బడిలో విద్యార్థుల కోసం నాలుగు కమిటీల ఏర్పాటు

వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం, జంట గ్రామాల బలిజపల్లి-జంగమయ్యపల్లి ఉన్నత పాఠశాలలో, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మల్లేష్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులచే ఏపీజే అబ్దుల్ కలాం, శకుంతలా దేవి, సివి రామన్, రవీంద్రనాథ్ ఠాగూర్ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటితో పాటు ఎకో క్లబ్, గర్ల్స్ ఎంపవర్మెంట్ క్లబ్, ప్రహరీ కమిటీ, డిజిటల్ క్లబ్, లైబ్రరీ క్లబ్, స్పోర్ట్స్ అండ్ హెల్త్ హైజిన్ క్లబ్ అనే ఆరు క్లబ్బులను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు, క్లబ్బుల ఏర్పాటు ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్