ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం: నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం సందర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. యూరియా కొరత, కరెంట్ సరఫరా లోపాలు, కొనుగోలులో జాప్యం వల్ల రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్